కామారెడ్డి, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్ వ్యాక్సినేషన్ రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్యాధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యాధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామ సంఘాల మహిళలు సహకారం తీసుకుని గ్రామాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ విజయవంతం చేయాలని కోరారు. గ్రామస్థాయిలో ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు ఇంటింటికి తిరిగి అర్హతగల వారందరికీ వ్యాక్సినేషన్ వేసే విధంగా చూడాలని పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారిని కల్పన కంటే, జిల్లా పంచాయతీ అధికారిణి సునంద, వైద్యాధికారులు, ఎంపీవోలు పాల్గొన్నారు.