ఆర్మూర్, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఉదయం ఏడున్నర గంటలకు ఆలూరు గ్రామానికి చెందిన కొంగి పద్మ (45) అనే వివాహిత అదే గ్రామానికి చెందిన ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రెండు సంవత్సరాల క్రితం తన భర్త చనిపోయినప్పటి నుండి మానసికంగా ఆవేదనకు గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. కాగా పద్మ కుమారుడు సురేష్ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.