ఆర్మూర్, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు 77వ బూతు సభ్యులు చిట్యాల గంగాధర్ కాలు ఇన్‌ఫెక్షన్ అయిందని భారతీయ జనతా కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ దృష్టికి తీసుకెళ్లగా ఎంపి వెంటనేస్పందించి నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్‌కు వచ్చి చిట్యాల గంగాధర్‌ని పరామర్శించారు.
మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి 50 వేల రూపాయల చెక్కు అందించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసానిచ్చారు. ఎంపి వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య, సూర్యనారాయణ గుప్త, భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు.