కామారెడ్డి, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వికారాబాద్ జిల్లా చేవెళ్ల నుంచి బదిలీపై వచ్చిన కామారెడ్డి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం ఏం స్వాతికి కామారెడ్డి బార్ అసోసియేషన్ సోమవారం స్వాగతం పలికింది. ఈ మేరకు పదవీ బాధ్యతలు చేపట్టిన జడ్జికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి కోర్టు చాంబర్లో పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.
స్వాగతం పలికిన వారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు జోగుల గంగాధర్, సీనియర్ న్యాయవాదులు గోనెల జగన్నాథం, తాటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.