కామారెడ్డి, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 25తేది నుండి ప్రారంభం కాబోతున్న సందర్భంగా జిల్లాలోని కొన్ని ప్రవేటు కళాశాలలు మాస్ కాపీయింగ్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న విషయం ఏబివిపి దృష్టికి వచ్చిందని కాగా కామారెడ్డి జిల్లా కన్వినర్ బాను ప్రసాద్ అధ్వర్యంలో సోమవారం నోడల్ అఫీసర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఎబివిపి నాయకులు మాట్లాడుతు కొన్ని కళాశాలలు ప్రతి విద్యార్థి నుండి 1000 నుండి 2000 రుపాయలు వసూలు చేస్తున్నారని, ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రతి సెంటర్‌కు సిట్టింగ్ స్క్వాడ్ ఎర్పాటు చేయాలని, మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాలని అక్రమాలకు తావులేకుండా చూడాలని ఎబివిపి డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.