ఆర్మూర్, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్ళు వరి కోత కట్టింగ్ హార్వెస్టింగ్ మిషన్‌ను జాయింట్ కలెక్టర్ చంద్ర శేఖర్, డిసివో సింహాచలం, డిఎం సివిల్ సప్లయ్ అబిషేక్, పిఏసిఎస్ చైర్మన్ కళ్ళెం బొజరెడ్డి, ఏడిఏ హరికృష్ణ, తహసిల్దార్ వేణు గోపాల్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లడుతూ వరి ధాన్యం ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమాణాల ప్రకారం కొనుగోలు సెంటర్లకు తీసుకురావాలని రైతులకు సూచించారు. రైతులు వరి కోసేటప్పుడు హర్వేస్టర్ బ్లోయర్ 18-20 ఆర్‌పిఎం ఉంచి కోత కోసినట్లయితే తాళ్ళు, తప్ప గింజలు రాకుండ ఉంటాయని తద్వరా నాణ్యమైన ధాన్యం మద్దతు ధర రూ. 1960 పొందవచ్చని సూచించారు.
స్వయంగా హర్వేస్టర్ మిషన్ పై ఉండి వరి ధాన్యం నాణ్యత పరిశీలించారు. కార్యక్రమానికి సర్పంచు కళ్ళెం మోహన్ రెడ్డి, పిఏసిఎస్ సంఘం వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, డైరెక్టర్లు కళ్ళెం సాయరెడ్డి, సింగేడి మల్లుబాయి, దుదిగం ప్రమోదు కుమార్, అరె రాజేశ్వర్, పచ్చుక లసుంబాయి, సంఘం కార్యదర్శి మల్లేష్, సిబ్బంది, ఏఇఓ వసుధం గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు, రైతు బంధు కో ఆర్డినేటర్ బొప్పారం రమేష్, రైతులు పాల్గొన్నారు.