ధాన్యం సేకరణలో రైతులకు అండగా ప్రభుత్వం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎఫ్‌సిఐ నిర్దేశించిన దానిని మించి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తీసుకుంటున్న చర్యలకు జిల్లా ప్రజల తరఫున యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లాలో ధాన్యం సేకరణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకుని అవసరమైన ఇన్ఫ్రస్ట్రక్చర్‌ సమకూర్చుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వానాకాలం వరి ధాన్యం సేకరణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులతో బుధవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ, రైతులకు అందుబాటులో, పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇబ్బందులు ఏర్పడకుండా వెంట వెంట తగు చర్యలు తీసుకొని రైతుల నుండి సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించడానికి వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి రైతులకు చెల్లించి ఎఫ్‌సిఐ నుండి వచ్చిన తర్వాత సర్దుబాటు చేసుకుంటున్నామని ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. అందుకు జిల్లా ప్రజల తరఫున, యంత్రాంగం తరపున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. నల్లగొండ జిల్లా కంటే మన జిల్లా సాగు పరంగా చిన్న జిల్లా అయినప్పటికీ ధాన్యం సేకరణ రైతులకు ధాన్యం ధరలు తగ్గించడంలో మన జిల్లా రెండో స్థానంలో నిలిచిందని ఇందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, సొసైటీ చైర్మన్లు, అధికారులు, సిబ్బంది, సివిల్‌ సప్లై, మార్కెటింగ్‌ శాఖలతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారం రైతులు ఎఫ్‌ఏక్యూ కలిగిన ధాన్యాన్ని మాత్రమే తీసుకువచ్చే విధంగా గ్రామ, మండల స్థాయి లో రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, బ్యాంకు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ప్రతులను ధాన్యంతో పాటు రైతులు కొనుగోలు కేంద్రాల్లో సమర్పిస్తే రెండు మూడు రోజుల్లో ధాన్యం మొత్తాలను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి వీలవుతుందని రైతులకు సూచించారు.

ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలును కొన్ని సంవత్సరాల క్రితమే నిలిపివేసినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం రైతులకు అండగా నిలిచామని తెలిపారు. వాన కాలంలో ధాన్యం దిగుబడి 10 లక్షల 66 వేల మెట్రిక్‌ టన్నులు వస్తుందని అధికారులు అంచనా వేస్తుండగా 24 గంటల కరెంటు పుష్కలంగా వర్షాలతో చెరువులు ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నందున ఇంకా ఎక్కువ వస్తుందని తాను అనుకుంటున్నానని ఇందులో కనీసం 9 లక్షల టన్నులు యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే అవకాశం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

458 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా చిన్న గ్రామాలను కలుపుకొని సుమారుగా అన్ని గ్రామాలలో వీటిని ఏర్పాటు చేసినట్లు అని ఈ కేంద్రాల ద్వారా 271 రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని పంపించనున్నామని మంత్రి వివరించారు. ఇంత పెద్ద మొత్తంలో భాగంగా సేకరణకు చర్యలు తీసుకుంటున్నాం అందుకు అవసరమైన ఇన్ఫ్రస్ట్రక్చర్‌ అయినా ప్యాడీ క్లీనర్లు, తూకం కాంటాలు చెన్ని మిషన్లు టార్పాలిన్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి రైతులకు కనీస సదుపాయాలు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను 2.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉన్నందున ప్రస్తుతం ఉన్న 76 లక్షల గన్నీ బ్యాగులను కవర్‌ చేసుకుంటూ ఎక్కడ కూడా కొరత రాకుండా ప్రతిరోజు గన్ని బ్యాగులు అందే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని రైతులకు ఇబ్బందులు కాకుండా చూసుకోవాలన్నారు.

పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేనందున అక్కడి నుండి గద్వాల్‌ జిల్లా తీసుకువచ్చి పన్నెండు వందల రూపాయల చొప్పున పోటీపడి రైతులు ధాన్యాన్ని కొంటున్నారు అని మన వద్ద ప్రభుత్వం కనీస మద్దతు ధర ఏ గ్రేడ్‌ 1960 కామన్‌ గ్రేడ్‌కు 1940 చెల్లిస్తుందని రైతులు నిబంధనల ప్రకారం 17 శాతం లోపే తేమ ఉండే విధంగా శుభ్రం చేసుకుని తీసుకోవచ్చు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నానని కోరారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి రైతుల నుండి ఒక ప్రణాళిక ప్రకారం రైస్‌ మిల్లులకు ట్యాగింగ్‌ చేసి ఎప్పటికప్పుడు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని రైతు మిల్లులకు పంపించడం పకడ్బందీ ప్రణాళికపై ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. రైస్‌ మిల్లులలో కడ్తా పేరుతో అధిక ధాన్యాన్ని తీసుకోవడాన్ని కట్టడి చేయాలని ఆదేశించామని రవాణా సమస్యలు లేకుండా కూడా లారీ కాంట్రాక్టర్లతో మాట్లాడాలని రవాణా అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు. ఎఫ్‌సిఐ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని తేవాలని వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు, ఎమ్మెల్సీ గంగాధర్‌ గౌడ్‌, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్ర మిశ్రా, అదనపు సీపీ అరవింద్‌, డిసిసిబి వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మోహన్‌ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధ్యక్షులు సహకార సంఘాల చైర్మన్లు, జిల్లా రైతు బంధు అధ్యక్షురాలు, డిసిఓ సింహాచలం, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, పోలీసు, రవాణా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »