కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా గ్రామస్థాయిలో ఉచిత న్యాయ సేవ సహాయం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు.
గ్రామస్థాయిలో వివిధ శాఖలకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని కోరారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి న్యాయ సాయం పొందే వీలుందని పేర్కొన్నారు. సర్పంచులు, అధికారులు గ్రామస్థాయిలో లీగల్ సర్వీస్ చట్టాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.