కామారెడ్డి, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నస్రుల్లాబాద్ మండలం మైలారంలో పల్లె ప్రక ృతి వనంను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ప్రకృతి వనం లో మొక్కలు వృక్షాలుగా మారడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అంకుల్ క్యాంపులో అవెన్యూ ప్లాంటేషన్ల పొలాల వద్ద మామిడి, బొప్పాయి మొక్కలు నాటడం వల్ల రైతులకు ఆదాయం వచ్చే వీలుందని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేసుకొని పంచాయతీల ఆదాయంను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ రాజాగౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.