కామారెడ్డి, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో రైస్ మిల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దాన్యం పండిరచడంలో బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని చెప్పారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, బీమా, ఉచిత కరెంటు సౌకర్యం కల్పించారని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కాలేశ్వరం ప్రాజెక్టు నీటిని మంజీరా నది ద్వారా నీరు రావడం ద్వారా ప్రాజెక్టు నిండి ఆయకట్టు రైతులకు రెండు పంటలు పండిరచుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో రూపాయలు 23 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రైతులు పంటల మార్పిడి విధానాన్ని అవలంబించాలని సూచించారు. తిమ్మాపూర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆర్టీవో రాజాగౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.