వేల్పూర్, అక్టోబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేల్పూర్ మండలంలోని మోతే, అక్లూర్ గ్రామాలలో మోతే సొసైటీ చైర్మన్ మోతే రాజేశ్వర్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వారితోపాటు వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, రామన్నపేట సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుంట రమేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని మంచి మద్దతు ధరను ఇస్తూ 100 శాతం వరి ధాన్యాన్ని కొనే విధంగా ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని సూచిస్తూ మొదటి రకం వరి ధాన్యానికి ధర క్వింటాలుకు 1940 రూపాయలు, రెండవ రకం వరి ధాన్యానికి 1960 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందన్నారు. మద్దతు ధర ప్రకటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను మంత్రివర్యుల చేతులమీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి వరి ధాన్యానికి మద్దతు ధర మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రకటించడం తెలంగాణ రైతులకు గొప్ప సువర్ణవకాశం అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనటువంటి వరి ధాన్యానికి మద్దతు ధర, వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే గొప్ప అవకాశం అని మంత్రి అన్నారు. మన రాష్ట్రాన్ని చుట్టుపక్కల పరిపాలిస్తున్న బిజెపి ప్రభుత్వం వరి పండిరచే రైతులను చిన్న చూపు చూడడమే కాకుండా కనీస ధర పన్నెండు వందల నుంచి 1300 వరకే కొనుగోలు చేస్తుందని బిజెపి ప్రభుత్వాన్నిó విధానాన్ని మంత్రి వేముల దుయ్యబట్టారు.
ఒక మన నిజామాబాద్ జిల్లాలోని 467 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా సొసైటీ కేంద్రాన్ని తెలిపారు. రైతులకు మంత్రి విజ్ఞప్తి ఏమనగా దయచేసి వరి కోతను పచ్చిగా ఉన్నప్పుడే కోసి తాలు లేకుండా పొళ్ళు లేకుండా, తేమ శాతం లేకుండా రైతులు కొనుగోలు కేంద్రానికి ఈ విధంగా ధాన్యాన్ని తీసుకు వస్తే ఒక్క శాతం కూడా వదలకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం తన బాధ్యత అని మంత్రి వేముల హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్, ఎంపీడీవో కమలాకర్, వేల్పూర్ మండల పిఎస్‌సిఎస్ చైర్మన్ కె రమేష్ రెడ్డి, జడ్పిటిసి రాకేష్ చంద్ర, ఎంపీపీ భీమ జమున రాజేందర్, ఎంపీటీసీ మొండి మహేష్, సర్పంచ్ తేగల రాధా మోహన్, ఉప సర్పంచ్ పిట్ల సత్యం, తెరాస నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.