జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్‌ పాల్గొని ప్రభుత్వ భూముల హరితహారం పోడు భూముల నర్సరీలు, వ్యాక్సినేషన్‌, వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల వివరాలు పంపాలన్నారు. హరితహారంలో మల్టీ లేయర్‌, ఆవిన్యూ ప్లాంటేషన్‌లో ఒక్క మొక్క కూడా ఎండి పోయి ఉండకూడదన్నారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా 100 శాతం కరెక్ట్‌గా ఉండాలన్నారు.

అవసరమైతే వారం రోజులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ఆర్‌అండ్‌బి రోడ్డుకు ఇరువైపులా మీ మండలాలలో ఒక్క ట్రీ గార్డ్‌ పడిపోయి ఉండకూడదని, ఎండిన మొక్కల ప్లేస్‌ లో రిప్లేస్మెంట్‌ చేసుకోవాలని, వాటరింగ్‌ చేయించాలన్నారు. వర్ని వెళ్తుంటే రోడ్డు వెంబడి ప్లాంటేషన్‌ బాగుందన్నారు. హైదరాబాద్‌ వెళ్లే రోడ్డు డిచ్‌పల్లి వద్ద వీడిరగ్‌ ఎక్కువగా ఉందన్నారు. రోడ్‌ సైడ్‌ ఉండే మొక్కలు నీట్‌గా ఉండాలన్నారు.

పోడు భూములు ఫారెస్ట్‌ మధ్యలో పోడు భూములు చేసేవారికి చివరలో చూపిస్తామన్నారు. నవంబర్‌ 8 నుంచి క్లెయిమ్స్‌ తీసుకుంటామన్నారు. టీమ్స్‌ ఫామ్‌ చేసి ఎంక్వయిరీ చేసి అర్హత గల వారికి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ ఫర్‌ పట్టాలు ఇస్తామన్నారు. అటవీ ఆక్రమణ కాకుండా ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ద్వారా ఫారెస్ట్‌ బొండ్రీ ఫిక్స్‌ చేయించాలని అన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లేబర్‌ టర్నోవర్‌ పెంచాలని నర్సరీలు ప్రిపరేషన్‌ చేయాలని జిపి మున్సిపాలిటీ డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహించి గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారంగా సీడ్‌ సేకరించాలన్నారు.

వ్యాక్సినేషన్‌ 18 సంవత్సరాలు నిండిన వారుతప్పక వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని స్టూడెంట్స్‌ స్టాప్‌ టీచింగ్‌ నాన్‌-టీచింగ్‌ హాస్టల్స్‌ స్కూల్స్‌ కాలేజెస్‌ అందరూ వ్యాక్సినేషన్‌ కంపల్సరీ వేయించుకోవాలని అన్నారు. వ్యాక్సిన్‌ తీసుకొని వ్యక్తులను లోపలికి రానివ్వకూడదని తెలిపారు. జనరల్‌ పబ్లిక్‌ కూడా కంపల్సరీ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. మొదటి డోస్‌ ఈనెల చివరి నాటికి పూర్తి కావాలన్నారు. వ్యాక్సిన్‌ తప్పక తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ 12 గంటల్లో అన్‌లోడిరగ్‌ మిల్‌ టాపింగ్‌ గన్ని బ్యాగ్స్‌ చూసుకోవాలని ఎఫ్‌ఏక్యూలేని ధాన్యాన్ని కొనరాదన్నారు. సీఎంఆర్‌ డెలివరీ ఫోకస్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ మకరంద్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »