కామారెడ్డి, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిబిపేట్ మండలం, మాందాపూర్ గ్రామానికి చెందిన పందిరీ రామవ్వ ఊపిరితిత్తుల వ్యాధి తోబాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆక్సిజన్ అవసరమని డాక్టర్లు తెలపగా పందిరీ రామవ్వ కుటుంబం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ని ఫోన్లో సహాయం కోరారు.
కాగా షబ్బీర్ అలీ ెంటనే స్పందించి షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ అందించారు. ఈ సందర్భంగా రామావ్వ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ షబ్బీర్ అలీ అందించిన సహాయం తాము ఎప్పటికీ మర్చిపోలేమని, కరోనా సమయంలో కూడా ఎంతోమందికి ఆక్సిజన్ అందించి ఎంతో మందిప్రాణాలు కాపాడారన్నారు. ఆయన అధికారంలో వున్నా లేకున్నా పేదలకు సహాయం చేయడంలో ఎప్పటికీ ముందుంటారని, ఆయనను గెలిపించుకోలేక తాము ఓడిపోయామని తెలిపారు.
ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో దోమకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి, రాజు, రాకేష్ రెడ్డి, సిద్ధ రామ్ రెడ్డి, అమ్ములు ముకుందం జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోనె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్, ధాత్రిక సత్యం, అధికార ప్రతినిధి, పుట్నాల శ్రీనివాస్ 18వ వార్డు కాంగ్రెస్ నాయకుడు, లక్క బత్తిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.