నిజామాబాద్, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 12 లక్షల 46 వేల మందికి వాక్సిన్ వేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 8 లక్షలు మాత్రమే పూర్తి చేశారని ఈనెల 30 వరకు మొదటి డోస్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నర్సరీలు, హరితహారం, లేబర్ టర్న్ అవుట్, వ్యాక్సినేషన్‌పై మండల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ 18 సంవత్సరాలు నిండిన వారు తప్పక తీసుకోవాలని, జిల్లాలో ప్రోగ్రెస్ చాలా తకువగా ఉన్నదని జిల్లాలో వ్యాక్సిన్ టార్గెట్ 12 లక్షల 46 వేలు ఉండగా అందులో 8 లక్షలు మాత్రమే పూర్తి చేశారన్నారు. కావున అక్టోబర్ 30 వరకు పూర్తి కావాలని, నాలుగు రోజుల్లో 4.5 లక్షలు పూర్తి చేయాలని, ప్రతి మండలం, మున్సిపాలిటీలలో పరిశీలించగా మున్సిపాలిటీలలో చాలా తీసుకోవలసి ఉన్నదని తెలిపారు.
మున్సిపాలిటీలలో ఆశ వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి డేటా కలెక్ట్ చెయ్యాలని, జిల్లాలో ప్రతి రోజు 350 టీమ్‌లు తిరుగుతు ప్రతి టీమ్ ప్రతిరోజు కనీసం 100 మందికి వ్యాక్సిన్ వేయాలని టార్గెట్ ఇవ్వడమైనదని, కావున ప్రతి ఒక్క టీం 100 మందికి తప్పకుండా వెయ్యాలని మెడికల్ అధికారులను ఆదేశించారు. ఎంపిడిఓలు వ్యాక్సిన్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టి పూర్తి చెయ్యాలన్నారు. లేకుంటే కఠినంగా చర్యలుంటాయని హెచ్చరించారు.
అందరూ వ్యాక్సినేషన్ తప్పకుండా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకొని వ్యక్తులను లోపలికి రానివ్వ కూడదని తెలిపారు. జనరల్ పబ్లిక్ కూడా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. మొదటి డోస్ ఈ నెల చివరి నాటికి పూర్తి కావాలన్నారు.
హరితహారంలో మల్టీ లేయర్, ఆవిన్యూ ప్లాంటేషన్‌లో ఒక్క మొక్క కూడా ఎండి పోయి ఉండకూడదన్నారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా 100 శాతం కరెక్ట్‌గా ఉండాలన్నారు. మీ మండలాలలో ఒక్క ట్రీ గార్డ్ పడిపోయి ఉండకూడదని, ఎండిన మొక్కల చోట మరో మొక్క నాటి వాటరింగ్ చేయించాలన్నారు. హైదరాబాద్ వెళ్లే రోడ్డు డిచ్‌పల్లి వద్ద బీడిరగ్ ఎక్కువగా ఉందన్నారు. రోడ్ సైడ్ ఉండే మొక్కలు నీట్‌గా ఉండాలన్నారు. నేషనల్ హై వేలో మొక్కలు చాలా వరకు ఎండిపోయినందుకు ఫారెస్ట్ సిబందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రొపెరుగా మోనిటర్ చేయడం లేదని, మొక్కలను డబ్బులు పెట్టి కొన్నందుకు మనం దానిని ప్రతి రోజు మోనిటర్ చేయాలని, నేషనల్ హై వే పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. ఫారెస్ట్, ఎంపిడిఓలు ఇద్దరు కలసి కోఆర్డినేషన్ చేసుకొని పని చెయ్యాలని, ప్రతి రోజు 13 లక్షలు ఖర్చు చేస్తున్నాం కావున ప్రతి ఒక్కరు ప్రొపెరుగా పని చెయ్యాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలు అన్ని ఉండాలని, ఒక్క మొక్క కూడా పోవద్దని, మొక్కలు పోతే వారిపై కఠిన చర్యలు వుంటాయని అధికారులకు సూచించారు. నేషనల్ హై వే ప్రతి రోజు బీడిరగ్ చెయ్యాలని మొక్కలు ఎండి పోకుండా చూడాలన్నారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ లేబర్ టర్నోవర్ పెంచాలని గతంలో చెప్పాము కానీ పెరగలేదన్నారు. ఫారెస్ట్ ఉన్న దగ్గర కూడా పెరుగనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ టర్నవుట్ ప్రతి రోజు ఓకేవిధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారి సునీల్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మకరంద్, డిఆర్‌డిఓ పిడి చందర్ నాయక్, జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్ నాయక్, మెడికల్ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.