వేల్పూర్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కుక్కునూరు శివారులో రైల్వే ట్రాక్‌పై నుండి వెళుతున్న గొర్రెలను గూడ్స్ రైలు ఢీకొని వెళ్ళింది. సుమారు ముప్పై నుండి నలభై గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు భోజన, భోజెందర్ చెందిన గొర్లు మేపుతూ కుక్కునూరు శివారులోని రైల్వే ట్రాక్‌పై నుండి వెళుతుండగా అకస్మాత్తుగా వచ్చిన గూడ్స్ ట్రైన్ వాటిపై వెళ్ళింది. ఈ సంఘటనలో 30 నుండి 40 గొర్రెలు మరణించినట్టు తెలిపారు. బాధితులు మాట్లాడుతూ తమను జరిగిన కష్టానికి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదుకోవాలని కోరారు.