నిజామాబాద్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష వ్రాసి అర్హత సాధించిన విద్యార్థులు నవంబర్ 3 తేదీ లోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి, సర్టిఫికెట్స్ని స్కాన్ చేసి మీ సేవా కేంద్రాలలో అప్లోడ్ చేయాలని అధ్యయన కేంద్ర రిజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసిన తరువాత ఆన్లైన్ కౌన్సిలింగ్ కోసం 400 రూపాయలు చెల్లించాలన్నారు. సర్టిఫికెట్స్ పరిశీలించిన తరువాత సెలెక్టెడ్ లిస్టును వెబ్సైట్లో ప్రకటిస్తారని తెలిపారు. ఇతర వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ లెటెస్ట్ అప్డేట్లో తెలుసుకోవాలన్నారు. అడ్మిషన్ వచ్చిన తరువాత చివరికి నవంబర్ 19 నుంచి 22 తేదీల మధ్య టూషన్ ఫీజు చెల్లించాలన్నారు.