కామరెడ్డి, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయ పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ అధ్యక్షులు సంబారి మోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంబారి మోహన్, రామారెడ్డి మండలం ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, రామారెడ్డి మండల రైతు బంధు అధ్యక్షులు గురజాల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రామారెడ్డి, మాచారెడ్డి మండల సంబంధించి ఐదు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతుబిడ్డ కాబట్టి రైతుల యొక్క ఆవేదన అతనికి తెలుసు కాబట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 1960 కింటాలు చొప్పున తీసుకోవడం జరుగుతుందని, బ్రిగేడ్ వరి ధాన్యానికి 1940 చొప్పున తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు బిజెపి, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు నమ్మవద్దని తెలిపారు.
వరి కొనుగోలు కేంద్రంలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం ఉందని ఇట్టి విషయాన్ని ప్రజలు గ్రహించాలని తెలిపారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ యొక్క ఆదరాభిమానాలు రైతన్నలకు తెలుసని వారు రైతులకు న్యాయం చేసే వ్యక్తులు కాబట్టి వివిధ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రమును ప్రారంభం జరిగిందని తెలిపారు.
కార్యక్రమంలో సింగరాయ పల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి నర్సాగౌడ్, జిల్లా రైతు బంధు కమిటీ మెంబర్ కాసర్ల రాజేందర్, ఐడీసీఎంఎస్ మేనేజర్ నగేష్, అసిస్టెంట్ మేనేజర్ చిన్నన్న, అకౌంటెంట్ జయ ప్రకాష్ రావు, రామారెడ్డి మండల జెడ్పీటీసీ నా రెడ్డి మోహన్ రెడ్డి, రామారెడ్డి మండల్ టిఆర్‌ఎస్ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, సూపర్‌వైజర్ శ్రీనివాస్, సెంటర్ ఇంచార్జి ఎల్లం, సింగరాయపల్లి గ్రామ అధ్యక్షులు బైరయ్య, రైతు మండల కమిటీ అధ్యక్షులు యాదవ రెడ్డి, ప్రచార కార్యదర్శి సాయిలు, వివిధ గ్రామాల సర్పంచులు, తెరాస పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలు పాల్గొన్నారు.