డిచ్‌పల్లి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం జరిగిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఈ.సి. సమావేశంలో పలు విషయాలు ఆమోదించారు. ఈ. సి సభ్యుల సూచన మేరకు ప్రస్తుత రిజిస్ట్రార్‌ను మార్చి ఆచార్య యదగిరిని నియమించారు. పొరుగు సేవల ఉద్యోగులను ఎవరిని అపాయింట్ చేయలేదని తెలిపారు. నాన్ టీచింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు ప్రభుత్వ సూచనల మేరకు పెంపు చేయడం జరుగుతుందని, గ్రాడ్యుడ్యూటీ 12 లక్షల నుండి 16 లక్షల వరకు పెంపు ఉంటుందన్నారు.
నాన్ టీచింగ్ స్టాఫ్ పి.ఆర్.సి 2021 అమలు చేయడం జరుగుతుందని, సెల్ఫ్ ఫైనాన్స్ సంబందించిన జి.ఓ నంబర్ 141 అమలు చేస్తామని, గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అర్హులు అయిన వారికి గైడ్ షిప్ ఇవ్వడం, వచ్చే సంవత్సరం నుండి ఎమ్.ఎస్సి. జూవాలజి ప్రారంభమవుతుందన్నారు.
భిక్నూర్‌లో ఉన్న క్యాంపస్‌ను మొత్తం డిగ్రీ కొరకు, విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా కల్పిస్తామని, వచ్చే సంవత్సరం నుండి డిగ్రీ, పి.జి. డిజిటల్ ఎవాల్యూషన్ చేయడం. నవంబర్ ఒకటవ తారీకు నుండి అందరికి బయోమెట్రిక్ విధానము అమలు చేస్తామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో లాగా యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
తదుపరి ఈ.సి సమావేశం 26 లేదా 27 నవంబర్ 2021 రోజు ఉంటుందన్నారు. కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీని అందరూ కలసి అభివృద్ధి చేయాలని సూచించారు. చివరగా ఈ.సి. సభ్యులందరిని సన్మానించారు. సమావేశానికి ముందు నవీన్ మిట్టల్‌కి, ఇతర సబ్యులకు యన్.యస్.యస్. విద్యార్థులు స్వాగతం పలికారు.
సమావేశంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్తా, కమిషనర్ నవీన్ మిట్టల్ ఐ.ఏ.యస్, రిజిస్ట్రార్ ఆచార్య పి.కనకయ్య, సభ్యులు ఆచార్య నసీం, డా. ప్రవీణ్ కుమార్, వసుంధర, డా. మారయ్య గౌడ్, యల్.యన్ శాస్త్రి, గంగాధర్ గౌడ్, రవీందర్ రెడ్డి, నాగరాజు, చివరగా సభ్యుల సూచన మేరకు ఆచార్య యం. యాదగిరి పాల్గొన్నారు.