నిజామాబాద్, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఆదివారం ఐదో రోజున జిల్లాలోని 71 పరీక్ష కేంద్రాల్లో మొత్తం విద్యార్థులు 1247 మంది గైర్హాజరు అయ్యారు. జిల్లాలోని మొత్తం 57 పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ పర్యవేక్షించి తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘు రాజ్ జిల్లా కేంద్రంలోని నాగారం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (మైనారిటీ) కళాశాలను, మోడ్రన్ కాకతీయ జూనియర్ కళాశాలను, విశ్వశాంతి జూనియర్ కళాశాలను, విక్టర్ జూనియర్ కళాశాల, ఆర్య నగర్లోని ఎస్.ఆర్. జూనియర్ కళాశాల, ధర్మారంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, డిచ్పల్లి ఎస్.పి.ఆర్. కళాశాలలో తనిఖీ చేశారు.
అలాగే పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, చిరంజీవి, కనకమహాలక్ష్మి 14 పరీక్ష కేంద్రాలను, అలాగే హైపవర్ కమిటీ చిన్నయ్య ఆధ్వర్యంలో 5 పరీక్ష కేంద్రాలు, అలాగే ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 31 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
జిల్లాలోని 71 పరీక్షా కేంద్రాలు జనరల్ విద్యార్థుల మొత్తం పదహారు వందల 476 విద్యార్థులకు గాను 971 మంది విద్యార్థులు గైర్హాజర్ కాగా 15705 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ మొత్తం 2213 మంది విద్యార్థులకు గాను 276 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 1,937 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదివారం రోజు పూర్తయ్యాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘు రాజు వివరించారు.