కామారెడ్డి, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో మహేష్ అనే దళిత యువకుడు ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెవైఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్బంగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు నరేంధర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగి మహేష్ ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందా అని అనుమానాలు కలుగుతున్నాయని వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మహేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో స్పష్టత ఇవ్వక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు.