జీవో 60 అమలుకై ధర్నా

నిజామాబాద్‌, నవంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 60 ప్రకారం మున్సిపల్‌ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్‌ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని కార్పొరేషన్‌ పాలకవర్గం తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్‌ స్టాఫ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షులు వై.ఓమయ్య, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పెంచుతూ జూన్‌ నెలలో జీవో నెంబర్‌ 60 విడుదల చేసిందన్నారు. జీవో ప్రకారం వివిధ కేటగిరీల వారీగా మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెరగాల్సి ఉండగా, నేటికీ అమలు కాకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే కేటగిరీల వారీగా వేతనాలు పెంచుతూ వచ్చిన జీవో నంబర్‌ 60ని మున్సిపల్‌ కార్మికులకు అమలు చేయాలని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలకమండలి తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ విషయమై శనివారం ఉదయం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ఏఐటియుసి, ఐఎఫ్‌టియూ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నామన్నారు. మున్సిపల్‌ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇటీవల కొత్తగా నియమించబడిన మున్సిపల్‌ కార్మికులు, డ్రైవర్లకు వేతనాలు పెండిరగ్‌ ఉన్నాయని, వారందరికీ వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. కార్మికులందరికీ ప్రతి నెల 1వ తేదీన వేతనాలు వచ్చేట్టు చర్యలు తీసుకోవాలన్నారు. విలేకరుల సమావేశంలో ఐ.ఎఫ్‌.టి.యు నాయకులు టి.విఠల్‌ పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »