నిజాంసాగర్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి పట్టణంలో, మండలంలో మృతిచెందిన కుటుంబాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆదివారం ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ నెల మూడో తారీఖున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హౌస్ల శ్రీనివాస్, అతని తమ్ముడు జగన్, వారి కుటుంబాలను పరామర్శించి శ్రీనివాస్ జగన్ కూతుళ్లను ఓదార్చారు.
ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎల్లారెడ్డి మండలం లోని సోమరా గడు తండాకు చెందిన పుణ్య నాయక్ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందగా వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సింగిల్విండో చైర్మన్ నరసింహులు, కౌన్సిలర్లు పద్మ శ్రీకాంత్, ఎరుకల సాయిలు, రాము, ఎల్లారెడ్డి టిఆర్ఎస్ అధికార ప్రతినిధి రామప్ప, టిఆర్ఎస్ నాయకులు ఇమ్రాన్, తిరుపతి, అరవింద్ గౌడ్, శ్రీనివాస్ మనోజ్, టౌన్ అధ్యక్షుడు సతీష్, చింతల శంకర్, లింగం, శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, తిమ్మాపూర్ సర్పంచ్ దామోదర్, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.