వైద్య సేవలకు యంత్ర సామాగ్రి అందించడం అభినందనీయం

నిజామాబాద్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి దాతలు యంత్ర సామాగ్రి విరాళంగా ఇవ్వడం ఎంతైనా అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌కు చెందిన రెడ్డి అండ్‌ కో ఆధ్వర్యంలో రెడ్‌ క్రాస్‌ సంస్థకు ఎస్‌.డి.పి. మెషిన్‌ అందుచేసే కార్యక్రమంలో ఐఆర్‌సిఎస్‌ చైర్మన్‌ అండ్‌ కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆదివారం ప్రముఖ వ్యాపార సంస్థ రెడ్డి అండ్‌ కంపెనీ వారు రు. 30 ముప్పై లక్షల విలువైన సింగల్‌ డోనార్‌ ప్లేటిలెట్స్‌ (ఎస్‌.డి.పి) మెషిన్ని రెడ్‌ క్రాస్‌కి విరాళంగా అందజేశారు. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏలేటి రవీందర్‌ రెడ్డి తన తల్లితండ్రులు స్వర్గీయ ఏలేటి రాంచందర్‌ రెడ్డి, తల్లి స్వర్గీయ ఏలేటి గంగా దేవి, సతీమణి స్వర్గీయ సుష్మ జ్ఞాపకార్థం విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కంఠేశ్వర్‌లో గల వారి స్వగృహం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ సంస్థకి 30 లక్షల విరాళాన్ని అందచేయటం హర్షణీయం అని అన్నారు. రెడ్డి అండ్‌ కంపెనీ గతంలోను రెడ్‌ క్రాస్‌కి అంబులెన్సుని అందచేసారని చెప్పారు, సమాజానికి తమ వంతు బాధ్యతగా సేవలు అందించేందుకు ముందుకు రావడం వారి దాతృత్వానికి నిదర్శనం అని తెలిపారు. భవిష్యత్‌లోను తమ సేవ భావంతో ముందుకు సాగాలని అలాగే కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో రవీందర్‌ రెడ్డి కుటుంబ సభ్యులు, ప్రముఖ సీనియర్‌ వైద్యుడు, ప్రగతి ఆసుపత్రి యజమాని డా.లక్ష్మా రెడ్డి, రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ బాద్యులు డా.నీలి రాంచందర్‌, కార్యదర్శి బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్‌, కోశాధికారి కరిపే రవీందర్‌, ఐ.ఎం.ఏ అధ్యక్షులు డా.సుభాష్‌, డా.జీవం రావు, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ విశాల్‌, హోప్‌ ఆసుపత్రి యజమాని డా.కృష్ణ కిషోర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »