దళితులకు అన్యాయం జరిగితే ఊరుకోను

ఆర్మూర్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మార్పీఎస్‌ ఉద్యమకారులు దళిత ముద్దుబిడ్డ ఇందారపు స్వప్న-రాజులతో పాటు కుటుంబ సభ్యులు ఇందారపు వసంత-గోపి లు మాదిగ కుల సంఘ నాయకులతో ఆదివారం ఉదయం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని కలిసి ముఖాముఖి తమ సమస్యను పలువురు ప్రజా ప్రతినిధుల సమక్షంలో గోడు విన్నవించారు.

ఇందరపు రాజు తండ్రి నరసయ్య గత 70 సంవత్సరాలుగా సర్వే నంబర్‌ 401 గలదు ఫ్లాట్‌ నెంబర్‌ 157లో ఆర్మూర్‌ పట్టణంలోని జిరాయాత్‌ నగర్‌ కాలనీలో కూలీ పని చేస్తూ జీవనం కోనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా ఇందరపు నరసయ్య వారి పూర్వీకుల స్థిరత్వ ఆస్తులు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నివాసముంటూ ఉపాధిగా కూలిపని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇట్టి విషయంపై స్థానిక ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి తమ గోడును ఆదివారం విన్నవించారు.

ఈ సందర్భంగా వారసుడైన ఇందారపు రాజు ఆర్మూర్‌ పట్టణ ఎమ్మార్పీస్‌ అధ్యక్షులు మాట్లాడుతూ వారి తాత ముత్తాతల ఆస్తులపై తమకు హక్కు ఉందని ఆయన ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో స్థానిక ప్రముఖ న్యాయవాది ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి ఆయన దళితులపై చూపించే విధానం అవలీలగా దళితులను అవమానించే దిశలో ప్రప్రధమంగా మొదటి స్థానంలో తెరాస నాయకులు ఖాందేశ్‌ శ్రీనివాస్‌ ఉన్నారని ఎమ్మెల్యేకు వివరించారు.

అలాగే దళితులపై తప్పుచేసిన ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో నలుమూలల జీవనాన్ని కొనసాగిస్తున్న బహుజనులు దళితులు వారి ఆస్తులతో పాటు వారిని కాపాడే పూర్తి బాధ్యత ప్రజాప్రతినిధులని పలుమార్లు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు సంబంధిత ప్రజాప్రతినిధులకు తెరాస కార్యవర్గ సమావేశంలో పలుసార్లు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తన నియోజకవర్గంలో దళితులకు ప్రధాన స్థానం కల్పిస్తూ దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రాష్ట్రంలోని మొదటి స్థానంలో బహుజన దళిత బిడ్డలని గౌరవించే ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారని అన్నారు. ఆదివారం దళిత బిడ్డలు నిరుపేద కుటుంబాలకు చెందిన మాదిగ జాతి కులానికి చెందినవారు ఇందారపు నరసయ్యతో పాటు కుటుంబ సభ్యులు, కుల సంఘ సభ్యులు, వారి వారసులు ఇందారపు రాజు, ఇందారపు గోపిలు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి తమ గోడు వినిపించారు. తాము నివసిస్తున్న స్థలాన్ని కాపాడాలని విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »