నిజామాబాద్, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల వారోత్సవాలను మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో (7-14 నవంబర్ 2021) నిర్వహించడం జరుగుతుందని వారోత్సవాలను విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలు భాగంగా అడిషనల్ కలెక్టర్ చాంబర్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారం రోజుల పాటు చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా సంక్షేమ అధికారి రaాన్సీ లక్ష్మి వివరించారు. సమావేశాన్ని ఉద్దేశించి అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ బాలల హక్కులు కాపాడడంలో ప్రతి ఒక్కరు తమ వంతు సహకరించాలని కోరారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, బరువు తక్కువ పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలు గుర్తించి వారిని తల్లిదండ్రులకు పోషక పదార్థాల గురించి అవగాహన కల్పించాలని, పాఠశాలలో ఉన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలని, జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కల్పించాలని కోరారు.
అనంతరం బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిపిఓ జయసుధ, డిఎం అండ్ హెచ్‌ఓ సుదర్శన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సంపూర్ణ, డిడబ్ల్యు రaాన్సీ లక్ష్మి, జిసిడివో వనిత, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ స్వర్ణ, డిసిపివో చైతన్య కుమార్, చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.