డిచ్‌పల్లి, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్ భవనంలో బోధనేతర సిబ్బందితో ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్త సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధనేతర సిబ్బంది సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మన విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఉంటుందని, ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంకా ఎక్కువ సహాయం ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఉన్నత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దవచ్చన్నారు.
అందరూ ఇప్పటి లాగే ఎప్పటికి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. తనకు ఈ మధ్యనే ప్రపంచ స్థాయిలో రెండవ ర్యాంకింగుల కేటగిరీలో స్థానం లభించడం వలన మన విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయిలో గుర్తించడం జరిగిందని, ఇందులో భాగంగా బోధనేతర సిబ్బంది గురించి మాట్లాడుతూ మీరందరు కూడా డిటర్మీనషన్, డెడికేషన్, సేవా భావం అనే మూడిరటితో పని చేయాలని సూచిస్తూ ఉత్సాహపరిచారు.
రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ బోధనేతర సిబ్బంది సేవలు మరువలేనివి అని అన్నారు. నాక్ గుర్తింపు విషయంలో కూడా మీ సేవలు చాలా అవసరం ఉంటాయన్నారు. ఇక్కడ ఉన్న బోధనేతర సిబ్బంది చాలా సంవత్సరాల అనుభవం ఉంది కావున మీరందరు విశ్వవిద్యాలయ అభివృద్ధి కొరకు మీ అనుభవాన్ని ఉపయోగించాలని పేర్కొన్నారు. సాధారణంగా బోధనేతర సిబ్బందికి తాను ప్రతినిధిగా ఉంటానన్నారు.
అకడమిక్ పరంగా అభివృద్ధికై డీన్‌ల పాత్ర ఎక్కువగా ఉంటుందని, విశ్వవిద్యాలయము అభివృద్ధి చెందాలంటే బోధన, బోధనేతర సిబ్బంది ఒకరికొకరు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రిన్సిపాల్ సహాయ ఆచార్య నాగరాజు మాట్లాడుతూ మీ అందరికి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. సమావేశంలో ఈ.సి. మెంబర్స్ ఆచార్య నసీం, డాక్టర్ రవీందర్ రెడ్డి, ఏ.ఆర్. లు విజయలక్ష్మీ, సాయగౌడ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఖాదర్ మొయినోద్దీన్, పి.ఆర్.ఓ డాక్టర్ అబ్దుల్ ఖవి, తదితరులు పాల్గొన్నారు.