నిజామాబాద్, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కరానికి రూపోంధించిన ధరణి వెబ్ సైట్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ చిట్ల పార్ధసారధి పరిశీలించారు. ధరణి ద్వారా సులభంగా పట్టామార్పిడి చేస్తున్న విధానంతో పాటు ఎదురువుతున్న సమస్యల గురించి సంబంధింత అధికారులతో మాట్లాడారు.
ఆర్మూర్ పట్టణానికి చెందిన పార్ధసారధి వ్యక్తిగత పనుల నిమిత్తం సోమవారం ఆర్మూర్ తహసీల్దార్ కార్యలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్మూర్ ఏసీపీ వేగళం రఘు అధికారుల నుంచి అర్‌అండ్ అతిథి గృహంలో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్‌లతో మాట్లాడారు.
అంతకు ముందు డిచ్‌పల్లి బెటాలియన్‌కు వెళ్లి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కమాండెంట్ సత్య శ్రీనివాస్‌తో పార్థ సారధి మాట్లాడారు. ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, యమాద్రి భాస్కర్‌లు పార్థసారధికి పుష్పా గుచ్చం అందజేసి సన్మానించారు.