వేల్పూర్, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఏడవ వార్డు మెంబర్ నవీన్ వార్డులో పలు అభివృద్ధి పనులు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ వార్డుమెంబర్ నవీన్ మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో గ్రామ అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.