ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పోటీకి నామినేషన్‌ దాఖలు చేసిన శ్రీకాంత్‌ గుప్తా

కామారెడ్డి, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవి కోసం జరిగే ఎన్నికలలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పోటీ నిమిత్తమై బుధవారం నామినేషన్‌ దాఖలు చేసినట్టు మోటూరి శ్రీకాంత్‌ గుప్తా తెలిపారు.

కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్యులు అందరూ ఈసారి తనకు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని ఆర్యవైశ్య సంఘ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి దోహదపడతానని, ఆర్యవైశ్యులకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటానని, యువకుడినైన తనకు మొదటిసారి అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో ఎన్నికల అధికారులు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు, శనిశెట్టి గౌరీ శంకర్‌, ప్రస్తుత జిల్లా అధ్యక్షులు యాద నాగేశ్వర్‌ రావు, నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు వలిశెట్టి లక్ష్మీరాజ్యం, పాత సత్యం, విశ్వనాధుల మహేష్‌ గుప్తా, ఎల్లంకి మురళి గుప్త, మొగిలిపల్లి భూమేష్‌, గోలి శ్రీనివాస్‌ గుప్తా, గంజి శ్రీనివాస్‌ గుప్తా, కూర శ్రీనివాస్‌ గుప్త, కామారెడ్డి వివిధ గల్లీ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »