లేబర్‌ టర్నవుట్‌ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లేబర్‌ టర్న్‌ ఔట్‌ ఎట్టి పరిస్థితుల్లో తగ్గరాదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌ నుండి పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నర్సరీలలో సాయిల్‌ కలెక్షన్‌ బ్యాగ్‌ ఫిల్లింగ్‌ సోమవారం వరకు పూర్తి కావాలన్నారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనం వచ్చే పది రోజుల్లో పూర్తి కావాలని తెలిపారు.

మినీ బృహత్‌ పల్లె ప్రకృతి వనం సోమవారం ప్రారంభం కావాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రతి గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ మధ్యాహ్నం నుండి వ్యాక్సిన్‌ డేటా ఎంట్రీ చేయాలని, వాక్సిన్‌ తీసుకోని వారికి వ్యాక్సినేషన్‌ ఇప్పించాలని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో లేబర్‌ స్టాండర్డ్‌గా కంటిన్యూ చేయాలని ఈరోజు ఇచ్చిన రిపోర్టుకు రోజు 10 శాతం లేబర్‌ పెరగాలన్నారు. తగ్గడానికి వీల్లేదన్నారు.

డిసెంబర్‌ 31 వరకు లేబర్‌ పెరుగుతూనే ఉండాలన్నారు. రెగ్యులర్‌గా జరిగే పనులతో పాటు ఎంపీడీవోలు దీనికి ప్రత్యేకంగా సమయం కేటాయించాలని కోరారు. నర్సరీల ప్రిపరేషన్‌ ప్రతి జిపిలో 20వేల మొక్కలకు తగ్గకుండా ప్రిపరేషన్‌ చేయాలని నెల క్రితం చెప్పామని 530 గ్రామపంచాయతీలో స్పీడ్‌ చేయాలని ఎల్లుండి వరకు సాయిల్‌ కలెక్షన్‌ బ్యాగ్‌ ఫిల్లింగ్‌ పూర్తిచేయాలని డిఆర్‌డివో కోఆర్డినేషన్‌ తీసుకోవాలన్నారు.

ఎంపీడీవోలు సీడ్‌ కొనుగోలు సోమవారం వరకు పూర్తి చేయాలని అన్నారు. నర్సరీలలో పెండిరగ్‌ ఉన్న పనులు సోమవారం సాయంత్రం వరకు పూర్తి చేయించాలన్నారు బృహత్‌ పల్లె ప్రకృతి వనం మంచి కార్యక్రమం వేగం పెంచాలని పిట్టింగ్‌, ప్లాంటింగ్‌ చేయాలని వచ్చే శనివారం వరకు ఎంపీడీవోలు పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్ర మిశ్రా, డిఆర్‌డివో చందర్‌ నాయక్‌, డిపివో జయసుధ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »