కామారెడ్డి, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలోగల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో రaాన్సీ లక్ష్మీబాయి, గురు నానక్ దేవ్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి మహనీయుల యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను మరువద్దని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని అన్నారు. గురునానక్ దేవ్ 1469 లో జన్మించాడని పదిమంది సిక్కు గురువులలో మొదటి గురువు అని, ఏకేశ్వరోపాసనను ప్రబోధించి కుల వ్యవస్థను వ్యతిరేకించిన గురువు అని అన్నారు. రaాన్సీ లక్ష్మీబాయి నవంబర్ 19, 1828 సంవత్సరంలో జన్మించారని అన్నారు. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించారని, రaాన్సీ లక్ష్మీబాయి భారతదేశం జోన్ ఆప్ ఆర్క్గా భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారని అన్నారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతినిధులు ఎస్టిఏ. ఖాద్రి, మోతే లావణ్య, జాకీర్ హుస్సేన్, హనుమాన్లు, రమేష్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.