ఆర్మూర్, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న నరేంద్ర డిగ్రీ కళాశాల యుజిసి నియామకాలను పాటించకుండా విద్యార్థుల దగ్గరనుండి విచ్చలవిడిగా ఫీజు వసూలు చేయడం జరుగుతుందని గతంలో కూడా విద్యార్థుల సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం జరిగిందని ఏబివిపి నాయకులు వినయ్ అన్నారు. ఈ మేరకు సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని లేనియెడల విద్యార్థులతో ధర్నా, రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల వద్ద నుండి డబ్బు వసూలు చేయకుండా అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ శాఖ నాయకులు పాల్గొన్నారు.