కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో డయాలసిస్ హబ్ ఏర్పాటుకు స్థలాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
స్థలం అనుకూలంగా ఉందని రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి కల్పన కంటే, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.