కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలంలోని పలు ఔషద దుకాణాలపై ఔషద నియంత్రణ శాఖ అధికారులు కామారెడ్డి డిఐ శ్రీలత, నిజామాబాద్ అర్బన్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఔషద దుకాణాలు నిబంధనలు ఉల్లంఘించారని ఫార్మాసిస్టు లేకపోవడం, బిల్లు పుస్తకాల నిర్వహణ సరిగా లేకపోవడం, షెడ్యూల్ రిజిస్టర్ నిర్వహణ లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ, ధరలు, తదితర వివరాలు పరిశీలించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాలపరిమితి ముగిసిన మందులు ఎప్పటికప్పుడు తొలగించాలని, కొనుగోలు బిల్లులు తప్పకుండా ఇవ్వాలన్నారు. డాక్టర్ చిట్టి లేకుండా నిద్రమాత్రలు, యాంటీ బయటిక్స్ విక్రయించరాదని సూచించారు. మెడికల్ దుకాణాల వద్ద సానిటైజర్ వాడాలని, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ దుకాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.