కార్మిక చట్టాలపై అవగాహన

ఆర్మూర్‌, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఆర్మూర్‌ పట్టణం వడ్డెర కాలనీ రెండవ వార్డు కౌన్సిలర్‌ సంగీతా ఖాందేష్‌ అధ్యక్షతన కార్మిక చట్టాలు, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ముత్యం రెడ్డి, ఆర్మూరు పట్టణ కార్మిక శాఖ అధికారి మనోహర్‌ విచ్చేశారు.

పేద ప్రజలకు కార్మికులకు అవసరమయ్యే పథకాల గురించి చట్టాల గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్‌, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలు సంగీత ఖాందేశ్‌ మాట్లాడుతూ కార్మిక చట్టాల గురించి రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆర్మూర్‌ ప్రాంతములో పెద్ద ఎత్తున చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు ఖాందేష్‌ సత్యం, మక్కల సాయినాథ్‌, బండారి నరేష్‌, రాపెన్‌ నరసయ్య, ఎల్లయ్య, సాయిలు, సుమన్‌, సాయి, చంటి, సాగర్‌, భూమేష్‌, ప్రశాంత్‌, స్థానిక సంఘ పెద్దలు, మహిళా సంఘం సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »