మోర్తాడ్, నవంబర్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మోర్తాడ్ మండల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు.
కవిత ఎన్నిక పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల జడ్పిటిసి బద్దం రవి, మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.