కామారెడ్డి, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యత ప్రమాణాలు పాటించిన ధాన్యాన్ని సహకార సంఘాలు సిఓవోలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలో సహకార సంఘాల కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమశాతం 17 లోపు ఉండేవిధంగా చూడాలన్నారు. తాలు, మట్టిపెళ్లలు, నల్లని గింజలు లేకుండా శుభ్రం చేసిన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తే మిల్లుల యజమానులు అన్‌లోడిరగ్ త్వరలో చేస్తారని చెప్పారు. ట్రాన్స్‌పోర్ట్‌లో ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.
రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి వసంత, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, సహకార సంఘం సిఈఓ పాల్గొన్నారు.