నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర సమక్షంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణ రెడ్డి శుక్రవారం అందజేశారు.
రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్, రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఇతర శాసనసభ్యులు గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, హనుమంత్ షిండే, జీవన్ రెడ్డి రెండు జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్లు, నగర మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.