నిజామాబాద్, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్‌లో గల బ్రిలియంట్ స్కూల్ లో న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో భారత రాజంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది పరిషత్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజ్ కుమార్ సుబెదార్ రాజ్యాంగం ప్రతి ఒక్కరూ గౌరవించాలని, దేశ స్థితిగతులను అధ్యయనం చేసి భవిష్యత్ తరాలకు అవసరమైన దూరదృష్టితో రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు.
రాజ్యాంగం మనందరికి స్ఫూర్తిదాయకమని దేశం మీద మన రాజ్యాంగం మీద అవగాహన కలగాలని అతిథిగా వచ్చిన న్యాయవాది పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్ అన్నారు. దేశం మీద రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని, మనం దేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా నడుచుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన పౌరులందరికీ సమాన హక్కులను బాధ్యతతో ముందుకు వెళ్లాలని కోరారు.
కార్యక్రమంలో రాజ్యాంగ పీఠికను విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ నాయకులు బిట్ల రవి, పి. శ్రీకాంత్, పాఠశాల ప్రిన్సిపల్ కే రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు.