భీమ్గల్, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతర మహోత్సవం కార్తీక పౌర్ణమి ముగించుకుని తరువాత వచ్చిన శనివారం 4వ శనివారం సెలవు దినం కావడంతో లింబాద్రి గుట్ట కి భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నృసింహుని దర్శనం కోసం ఉదయం నుండే బారికెట్ల మధ్యలో బారులు తీరారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం దేవస్థానం వారు ఏర్పరచిన అన్నదాన కార్యక్రమంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి వారి అన్నదానం స్వీకరించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
వేలాది సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ పండితులు నంబి వంశపారంపర్యాస్థులు అన్నీ సౌకర్యాలు కల్పించారు.