కామారెడ్డి, నవంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ధరణి టౌన్ షిప్ రిజిస్టేషన్ రుసుము రూ.3000 దరఖాస్తుదారునికి తిరిగి చెల్లించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి మండలం అడ్లూరు శివారులో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు అందించే ధరణి టౌన్ షిప్ను రూపొందించినట్లు చెప్పారు.
ఉమ్మడి జిల్లాలోని 580 అర్జీదారులు ఈ సేవ కేంద్రంలో గతంలో దరఖాస్తు రుసుము చెల్లించి రసీదు పొందారు. ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయిన చెల్లించి నటు రిజిస్ట్రేషన్ రుసుము తిరిగి దరఖాస్తుదారునికి చెల్లించటానికి నిర్ణయించినట్లు తెలిపారు. రుసుము చెల్లించిన లబ్ధిదారులకు నోటీసులు అందజేశామని చెప్పారు.
నోటీసు అందిన ఏడు రోజుల లోపు ఈ సేవ రసీదు, ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకం, పాన్ కార్డు నకలు పత్రలతో దరఖాస్తును జిల్లా పరిపాలన విభాగంలో చేసుకుని మీరు చెల్లించిన రుసుము తిరిగి పొందాలని సూచించారు. పూర్తి వివరాలకు 08468-220069 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.