రైతాంగ సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏ.ఐ.కే.ఎమ్‌.ఎస్‌, ఐ.ఎఫ్‌.టి.యు, పీ.వై.ఎల్‌, పి.ఓ.డబ్ల్యు సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కేంద్ర విద్యుత్‌ సవరణ చట్టం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏ.ఐ.కె.ఎమ్‌.ఎస్‌, ఐ.ఎఫ్‌.టి.యు, పీ.వై.ఎల్‌, పీ.ఓ.డబ్ల్యు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్‌ మాట్లాడుతూ యాసంగి వరి పంటను కొనుగోలు చేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు. వరి పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. జిల్లాలో గల రెండు చక్కెర ఫ్యాక్టరీలను ప్రారంభించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల పట్ల ప్రజలను చైతన్యం చేసిన తర్వాతే వరి పంట సాగుపై నియంత్రణ చేయాలన్నారు.

అప్పటివరకు రైతులను ఇబ్బంది పెట్టకూడదన్నారు. ప్రస్తుత వరి కొనుగోళ్లలో రైస్‌ మిల్లర్లు దోపిడిని కొనసాగించడం దుర్మార్గమన్నారు. దీనిపై జిల్లా అధికారులు సీరియస్‌ గా దృష్టి పెట్టాలన్నారు. రైతులను వేధిస్తున్న మిల్లర్‌లపై కేసులు నమోదు చేయాలన్నారు. జాతీయ విద్యుత్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పంటలకు మద్దతు ధర చట్టాన్ని ఈ శీతాకాల సమావేశాల్లోనే చేయాలన్నారు.

కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎమ్‌.ఎస్‌ రాష్ట్ర నాయకులు దేవారం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్‌, రామకృష్ణ, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు సత్యక్క, సుధాకర్‌ పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, వివిధ సంఘాల నాయకులు సురేష్‌, సాయగౌడ్‌, విటల్‌, కిషన్‌, రాజేశ్వర్‌, ఒడ్డెన్న, సాయిలు, బాలయ్య, సాయితేజ, నర్సక్క, రాజు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »