నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఒక్కరికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ వేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు.

సోమవారం రాత్రి వైద్య ఆరోగ్య మున్సిపల్‌ అధికారులతో జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగా వ్యాపిస్తున్న కొత్త కరోనా వేరియంట్‌ ద్వారా ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో యాక్షన్‌ తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి వల్ల దాని ప్రభావం తగ్గి ప్రమాద ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు.

అందువల్ల జిల్లాలోని 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రెండు డోస్‌ల వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మొదటి డోస్‌ తీసుకోని వారిలో అనుమానాలు ఉంటే స్థానిక అధికారులతో నివృత్తి చేయించి వ్యాక్సిన్‌ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని మొదటి డోస్‌ వంద శాతం పూర్తి చేయాలని అదేవిధంగా రెండవ డోస్‌ తీసుకోని వారికి కూడా వెంటనే వ్యాక్సినేషన్‌ కొరకు చర్యలు తీసుకోవాలన్నారు.

కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి డిఎంహెచ్‌వోకు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి మున్సిపల్‌ కమిషనర్‌, అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా, ఇన్చార్జి డీఎంహెచ్‌వో సుదర్శనం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, డిసెంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »