నిజామాబాద్, నవంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్ పిలుపుమేరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ ఆర్‌టిసి బస్టాండ్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ ప్రారంభం అయిన తర్వాత రక్తదాన శిబిరాలు తగ్గిపోయిందని ఈ మధ్యకాలంలో మళ్లీ కొంత మంది ముందుకు వస్తూ రక్తదానం చేయడం జరుగుతుందని, అందులో భాగంగా నిజామాబాద్ ఆర్టీసీ ఉద్యోగులు ముందుకు రావడం వారు సుమారు మూడు సెంటర్లు కలిపి 150 యూనిట్లు ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవడం సంతోషకరమని, విపత్కర పరిస్థితుల్లో చాలామందికి హెల్ప్ అవుతుందన్నారు.
బ్లడ్ చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ క్యాంపు ద్వారా ఇచ్చిన బ్లడ్ నెల వరకు ఉపయోగించు కోవడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. రక్తదానంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న సజ్జనార్ సార్‌కి ప్రత్యేకంగా జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ఆర్టిసి సంక్షేమ రంగంలో, అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సుధా పరిమళ, డివి ఎం. భాను ప్రసాద్, డి ఎం ఆంజనేయులు, రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ రామ్ చందర్, సెక్రెటరీ ఆంజనేయులు, స్టేట్ ఈసీ మెంబర్ తోట రాజశేఖర్, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, ట్రెజరర్ రవీందర్, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.