డిచ్‌పల్లి, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో యన్.యస్.యస్ యూనిట్ 1, 4 ప్రోగ్రాం ఆఫీసర్లు డా. స్రవంతి, డా. యన్.స్వప్న ఆధ్వర్యంలో డిసంబర్ ఒకటిన అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హల్‌లో జరిగిన కార్యక్రమములో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ సహాయ ఆచార్య ఏ. నాగరాజు, డా. ఏ. పున్నయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు హాజరయ్యారు.
కళాశాల ప్రిన్సిపాల్ సహాయ ఆచార్య ఏ. నాగరాజు మాట్లాడుతూ ఎయిడ్స్ నియంత్రణ మార్గాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం అని, నివారణోపాయాలు సవివరంగా తెలిపారు. అనేక రకాల స్లైడ్స్‌ను ఉపయోగించి నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలను వివరించారు.
డా. ఏ. పున్నయ్య మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజా ఆరోగ్యానికి కేటాయింపులు కేవలం 1.15 శాతం మాత్రమే, అభివృద్ధి చెందిన దేశాలలో 10 నుండి 15 శాతం బడ్జెట్ ప్రజా ఆరోగ్యానికి కేటాయిస్తారు. కావున అన్ని రకాల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అవగాహనతో పాటు బడ్జెట్ కేటాయింపులు ముఖ్యం అన్నారు. అవగాహన కార్యక్రమంలో 1, 4 యూనిట్స్ విద్యార్థులతో పాటు కళాశాల విద్యార్థులు పాల్గొని పలు అనుమానాలు నివృత్తి చేసుకున్నారు.
కార్యక్రమంలో ఎన్‌ఎన్‌యస్ కోఆర్డినేటర్ డాక్టర్ మోహన్ బాబు, వై శంకర్, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పి.ఆర్.ఓ డా. అబ్దుల్ ఖవి, ఏకనామిక్స్ హెడ్ డా. సంపత్, డా. శ్రీనివాస్, డా. దత్తహరి, డా. సాయిలు, డా. రామలింగం, డా. నర్సయ్య, డా. ప్రవీణ్‌తో పాటు యన్.యస్.యస్. బృందం తదితరులు పాల్గొన్నారు.