డిచ్‌పల్లి, డిసెంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ మెయిన్ క్యాంపస్ బాలికల వసతి గృహంను బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ చీఫ్ వార్డెన్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖవి తనిఖీ చేశారు.
అక్కడి విద్యార్థినులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. థర్డ్ వేర్ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి విద్యార్థినులు జాగ్రత్త వహించాలని ముఖానికి మాస్కు మరియు శానిటైజర్ దగ్గర ఉంచుకోవాలని, మీ రూమ్‌లో శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థినులకు పలు జాగ్రత్తలు వివరించారు. విద్యార్థులకు ఏఎన్‌ఎం, డాక్టర్ విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బాలికల వసతి గృహం వార్డెన్ డాక్టర్ పార్వతి, ఎస్టేట్ ఆఫీసర్ అశోక్ వర్ధన్ రెడ్డి, తదితరులు ఆయన వెంట ఉన్నారు.