కామారెడ్డి, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలంలోని స్కూల్ తాండ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలను ఎంపీపీ నా రెడ్డి దశరథ రెడ్డి పరిశీలించారు. విద్యా విషయంలో కనీస మౌలిక వసతులు విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
విద్యార్థులకు అందాల్సిన పౌష్టికాహారం అందడం లేదని తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పైన ఆగ్రహం చెందారు. ఇకముందు విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే సమయానుకూలంగా పాఠశాలకు రాకున్నా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
చరవాణిలో మండల విద్యా శాఖ అధికారికి సమాచారం అందజేసి ఉపాధ్యాయులపైన భోజన నిర్వాహకులపైన కఠిన చర్య తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలకు వచ్చి తనిఖీ చేసి విద్యార్థుల వివరాలు తెలుసుకొని, మంచిగా చదువుకోవాలని తెలిపారు.
దీనికి విద్యార్థులు ఎంపీపీకి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో చదువుకొని మీ పేరు నిలబెడతామని మీ మేలు మర్చిపోలేనని విద్యార్థులు ఆనందం వ్యక్తపరిచారు.