కామారెడ్డి, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రత్యామ్నాయ పంటల గోడ పతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాసంగిలో వరికి బదులుగా శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, వ్యవసాయ అధికారి సునీత, అధికారులు పాల్గొన్నారు.