బోధన్, డిసెంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలిస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం వారి ఆధ్వర్యంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఎడపల్లి ఓల్డ్ బస్టాండ్ వద్ద గ్రామప్రజలకు వివిధ రకాల అంశాలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు.
మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించి, గ్రామంలోని యువకులు ఎలాంటి మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు గురించి వివరించి ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 155260 లేదా డయల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని తెలిపారు.
ట్రాఫిక్ నియమాలు గురించి వివరించి, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపరాదని వివరించారు. సీసీ కెమెరాల ఆవశ్యకత తెలిపి, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని, సీసీ కెమెరాలు వల్ల నేరాలను అరికట్టవచ్చు అని వివరించి, ప్రజలందరూ సీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
డయల్ 100 గురించి వివరించి అత్యవసరసమయంలో డయల్ 100 ఉపయోగించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వాక్సిన్ తీసుకొవాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని తెలిపారు. మూఢనమ్మాలను నమ్మవద్దు అని తెలిపారు.
కార్యక్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తిరుపతి (ఎస్‌ఐపి), నిజామాబాద్ పోలీస్ కళాబృందం సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.