వడ్లు కొనుగోలు చేయకపోతే ఉద్యమం తప్పదు…

కామారెడ్డి, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపెట్‌ మండల కేంద్రానికి సంబంధించిన 84 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ముందు చూపుతో గ్రామాలు స్వచ్చంగా మారాయాని, తెలంగాణలో సొమ్ము ఒకరిది సోకు ఒకరిధిలా నడుస్తుందని కేంద్ర ప్రభుత్వ 14,15 వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్‌ కత్తిరించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. హుజురాబాద్‌ ఓటమితో రైతులపై కక్షతో గత 7 సంవత్సరాల కాలంలో ప్రతి గింజా మేమే కొంటున్నాం అని ప్రగల్బాలు పలికిన దొర ఇప్పుడు కేంద్రం కొనా అంటుంది అని కేంద్రాన్ని నిందిస్తున్నారని అన్నారు.

వానకాలం వడ్ల కొనుగోలు ఇంకో వారం రోజుల్లో పూర్తి చేసి డబ్బులు కూడా చెల్లించాలని అన్నారు. యాసంగీ వడ్ల విషయంలో కూడా కొనుగోలు చేస్తా అని స్పష్టమైన హామీ ఇవ్వాలని పుష్కలంగా కాలం అయినందున వడ్లు తప్ప వేరే పంట పండే పరిస్థితి లేదని, వడ్లు కొనుగోలు చేయకపోతే ఉద్యమం తప్పదని అన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »